- పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్
డిసెంబర్ 10,11,12 తేదీలలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర 23వ మహాసభల ఆహ్వాన సంఘం గోడ పత్రికలను ఎస్టీ బాలుర కాలేజ్ హాస్టల్ లో ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్ మాట్లాడుతూ, ఈ దేశంలో అనేక విద్యా వ్యతిరేక విధానాలు ముందుకు వస్తున్నాయని యుజిసి నూతన విధానాలు వలన యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కోల్పోతున్నాయని, విసిగా వ్యాపార వ్యక్తులు కూడా ఉండవచ్చు అనే అంశం యూనివర్సిటీలను యూనివర్సిటీలను వ్యాపార కేంద్రంగా మార్చేలా ఉన్నాయని అంతేగాక యూనివర్సిటీలలో కార్పొరేట్ పెట్టుబడిదారులు రాజకీయ నాయకులు ప్రవేశిస్తున్నారని అన్నారు.
నూతన విద్యా విధానం2020 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి విద్యార్థి పాఠ్య పుస్తకాలలో మతపరమైన , అంశాలను ప్రవేశపెడుతున్నదని ఈరోజు బెనారస్ లాంటి యూనివర్సిటీలలో జ్యోతిష్యము కర్మ సిద్ధాంతాన్ని భూత వైద్యము ప్రవేశపెడుతుందని అన్నారు. కర్ణాటకలో డార్విన్ పాఠ్యాంశాన్ని తీసేస్తున్నాయని శాస్త్రీయ విద్యా విధానం కలిగి ఉండవలసినటువంటి యూనివర్సిటీలు ఈరోజు మత కల్లోలాలకు కేంద్రంగా మారుస్తున్నారని ఆయన తెలిపారు.
మనం అందరం విప్లవ విద్యార్థులు అయినటువంటి జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు శాస్త్రీయమైన విద్య సాధనకై పోరాడవలసిన బాధ్యత ప్రతి విద్యార్థి పై ఉన్నదన్నారు.రాష్ట్రంలో రేవంత్ సర్కార్ పేదలకు విద్యార్థులు విద్యను దూరం చేసే కుట్రను చేస్తున్నారని అందులో భాగంగానే బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ శాతం కేటాయిస్తున్నారని అంతే కాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకుండా అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారని ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో 18 వేల పైచినుకు మూతపడ్డాయని అన్నారు.
కనీసం కరెంట్ లేని స్కూల్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని కోచడానికి బెంచ్ లు కూడా లేవని పాఠ్యాంశాలు బోధించడానికి టీచర్స్ కూడా కరువయ్యారని పాఠశాలలో మరుగుదొడ్లు లేవని తక్షణమే రేవంత్ సర్కార్ మేల్కొని 8500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రతి యూనివర్సిటీల అభివృద్ధికికనీసం 500 కోట్లు అయినా కేటాయించాలని మూతబడిన స్కూలను తక్షణమే రీ ఓపెన్ చేయాలని ప్రవేట్ కార్పొరేట్ ఫీజ్ దోపిడీలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నాయకులు కార్యకర్తలు సుభాష్ చంద్రబోస్, రాకేష్ చింటు, భస్కర్, చరణ్, వినయ్, ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.
