Sunday, March 22, 2026
Homeఆదాబ్ ప్రత్యేకం111 GO Violations | నిర్లక్ష్యమా.. నిలువు దోపిడీయా?

111 GO Violations | నిర్లక్ష్యమా.. నిలువు దోపిడీయా?

  • రంగారెడ్డి జిల్లాలో కుప్పకూలుతున్న 111 జీవో!

ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కబడుతున్నాయి.. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు పక్కదారి పడుతున్నాయి! రంగారెడ్డి జిల్లా సాక్షిగా 111 జీవో ఉల్లంఘనల పర్వం అప్రతిహతంగా సాగుతోంది. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమా? లేక వ్యవస్థను శాసిస్తున్న స్వప్రయోజనాల రాజ్యమా? భవిష్యత్తు తరాలకు అందించాల్సిన ప్రకృతి సంపదను, అక్రమ నిర్మాణాల కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తున్న వైనంపై ఇప్పుడు సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల అండ.. అక్రమార్కుల దండ! :

- Advertisement -

జిల్లా పంచాయతీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం వెనుక ఉన్న మర్మమేమిటి? డీపీఓ సురేష్ మోహన్ మొదలుకొని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు అక్రమ కట్టడాలను చూసీచూడనట్లు వదిలేయడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తం’ ఎవరిది?

ఒకవైపు కూల్చివేతలు జరుగుతున్నాయన్న ప్రచారం.. మరోవైపు మరుసటి రోజే పుంజుకుంటున్న నిర్మాణాలు! వ్యవసాయ భూముల్లో వెలుస్తున్న భారీ వాణిజ్య సముదాయాలు, విలాసవంతమైన ఫంక్షన్ హాళ్లు, అక్రమ రిసార్టులు.. అధికార యంత్రాంగం వైఫల్యాన్ని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల నెట్‌వర్క్‌ను, డీపీఓ కార్యాలయంలో సాగుతున్న ‘అవినీతి బాగోతాన్ని’ పూర్తి ఆధారాలతో ‘ఆదాబ్ హైదరాబాద’ బహిర్గతం చేయనుంది. వ్యవస్థల్లో వేళ్లూనుకున్న ఈ అక్రమాల సామ్రాజ్యంపై మా రాజీలేని పోరాటం.. త్వరలో పూర్తి వివరాలతో మీ ముందుకు..

‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

- Advertisement -
RELATED ARTICLES

Latest News