మోత్కూరు, జనవరి 30(ఆదాబ్ హైదరాబాద్): మోత్కూరు మునిసిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ(Nominations Process) శుక్రవారంతో ముగిసింది. తొలి రోజు 3, రెండో రోజు 34, మూడో రోజు 70 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 107 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. 37 కాంగ్రెస్(Congress), 23 బీఆర్ఎస్ (BRS), 15 బీజేపీ(BJP), 22 ఇండిపెండెంట్, 2 సీపీఎం, 4 సీపీఐ అభ్యర్థులు సమర్పించారు. 1వ వార్డులో తొమ్మిది, 2వవార్డులో ఎనిమిది, 3వ వార్డులో ఆరు, 4వ వార్డులో తొమ్మిది, 5వ వార్డులో తొమ్మిది, 6వ వార్డులో ఎనిమిది, 7వ వార్డులో ఎనిమిది, 8వ వార్డులో పదకొండు, 9వ వార్డులో పదకొండు, 10వ వార్డులో ఏడు, 11వ వార్డులో పదకొండు, 12వ వార్డులో పది నామినేషన్లు వచ్చాయి.
- Advertisement -
