Monday, October 27, 2025
ePaper
Homeతెలంగాణలొంగిపోయిన 8 మంది మావోయిస్టులు

లొంగిపోయిన 8 మంది మావోయిస్టులు

తెలంగాణలో తాజాగా 8 మంది మావోయిస్టులు శనివారం (మే 31న) ములుగు ఎస్పీ డాక్టర్‌ పీ శబరీష్‌ సమక్షంలో లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్రకు చెందిన ఈ మావోయిస్టులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం పాతిక వేల రూపాయల ఆర్థిక సాయం అందించినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారిలో డివిజన్‌ కమిటీ సభ్యులు దొర్పెట్టి మిర్గు, ఏరియా కమిటీ సభ్యురాలు మడవి టిడో, ఏరియా కమిటీ సభ్యుడు మిడియం బీమా ఉన్నారు. వీరితోపాటు ఇతర సభ్యులు ఉయిక అనిత, మడకం కమలేశ్‌, సోయం భీమే, మడవి మడక, మడవి ఇడుమ కూడా సరెండర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్‌, సీఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News