Tuesday, October 28, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుభారీ అక్రమ, నకిలీ మందుల స్వాధీనం

భారీ అక్రమ, నకిలీ మందుల స్వాధీనం

తెలంగాణ ఔషధ నియంత్రణ అధికారులు వరంగల్‌లోని గిర్మాజీపేటలో దాడులు నిర్వహించారు. అక్రమంగా భారీ మొత్తంలో నిల్వ ఉంచిన పశువుల మందుల అమ్మకాలను ఛేదించారు. రూ.2.5 లక్షల విలువైన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం (మే 27న) ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు.. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లోనూ తనిఖీలు చేపట్టారు. ‘ప్లాటోకోర్-టోటల్ సిరప్’ అనే ఆయుర్వేద ఔషధాన్ని సీజ్ చేశారు. ‘ఇది అన్ని రకాల ఫ్లూ, జ్వరాలకు ఉపయోగకరం’ అంటూ మందుల విక్రేతలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేసినందుకు రైడ్స్ చేసి పట్టుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News