తీన్మార్ న్యూస్ తో అందరికి సుపరిచితులైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ సొంత రాజకీయ పార్టీ ని ప్రారంభించబోతున్నారు. బీసీ ల సంక్షేమమే ధ్యేయంగా తన పార్టీ పని చేయబోతోందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 న తాజ్ కృష్ణ హోటల్ లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమం లో పార్టీ విధివిధానాలను, పార్టీ జెండా ను వెల్లడించబోతున్నారు. తమ పార్టీ లో బీసీ లకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భారత యూనియన్ లో విలీనమైన రోజున పార్టీని ప్రకటించడం విశేషం.
దశాబ్దాలుగా బీసీ ల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కేవలం రిజర్వేషన్లతో చేతులు దులిపేసుకున్నారు అని ఆయన వాపోయారు. బీసీ లకు పాలన బాధ్యతలు రావాలని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ బీసీ లకు అధికారం దిశ గా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 న జరిగే సమావేశానికి బీసీ లు అందరు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.