Saturday, October 4, 2025
ePaper
HomeతెలంగాణBandi Sanjay | లగ్జరీ కార్ల స్కాంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు...బండి సంజయ్ ఆరోపణలు

Bandi Sanjay | లగ్జరీ కార్ల స్కాంలో కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు…బండి సంజయ్ ఆరోపణలు

లగ్జరీ కార్ల స్కాంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో నిజం బయటపడాలని, దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా సంబంధిత శాఖలను కోరుతానని ఆయన తెలిపారు.

బండి సంజయ్ ట్విట్టర్ పోస్ట్:

‘కారు పార్టీ’ స్మగ్లింగ్ చేసిన లగ్జరీ కార్లపైనే నడుస్తోందా? అంటూ బీఆర్ఎస్ ఎన్నికల చిహ్నమైన కారును ఉద్దేశించి బండి సంజయ్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్(twitter) లో ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శిస్తూ, లగ్జరీ కార్ల స్కాం కేసులో అహ్మదాబాద్ డీఆర్ఐ అధికారుల చేతిలో అరెస్ట్ అయిన బసారత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూయిజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ నేత కౌంటర్ :

ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మన్నే స్పందించారు. తెలంగాణలోని బీజేపీ నేతలు కేవలం కేటీఆర్ ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శించరు అని ఆయన ప్రశ్నించారు. “ఒక కారు డీలర్ నుంచి కారు కొనడం నేరమైతే, ఆ డీలర్ నుంచి కార్లు కొన్న కాంగ్రెస్, బీజేపీ నేతలందరినీ అరెస్ట్ చేయాలి. ఆ కారు డీలర్ మీ బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ” అని క్రిశాంక్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆ కారు డీలర్ తో కలిసి ఉన్న ఫొటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News