Tuesday, October 28, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్పట్టువిడుపులతో పచ్చని సంసారం

పట్టువిడుపులతో పచ్చని సంసారం

మూడు ముళ్లు.. ఏడడుగులతో వివాహ బంధం ఏర్పాటుచేసుకున్నాక దంపతులు సంసార జీవితాన్ని సాఫీగా, సంతోషంగా సాగించాలి. జీవన ప్రస్థానంలో కొన్ని సార్లు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, ఆలోచనల్లో వ్యత్యాసాలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు, బంధుత్వ భేదాలు ఏర్పడొచ్చు. పలుమార్లు పరస్పర అవగాహన లోపం తలెత్తొచ్చు. ఇవన్నీ కలిసి కూర్చొని చర్చించుకుంటే దూరమయ్యే మామూలు సమస్యలే. ఇంత చిన్న లాజిక్‌ని చాలా మంది మిస్ అవుతున్నారు. బూతద్దం వేసి చూస్తున్నారు. పనికిరాని పంతాలకు పోతున్నారు. అంతరాన్ని పెంచుకొని దూరమవుతున్నారు. దంపతుల అహం వల్ల వారి పిల్లల బంగారు భవితవ్యం ఆగం అవుతోంది. గతాన్ని చేదు మాత్రలా మింగేసి భవిష్యత్తు కోసం ఆలోచిస్తే ఫలితం మహాద్భుతంగా ఉంటుంది. పెళ్లంటే నూరేళ్లు పంట అంటూ జీవిస్తే కలహాల కాపురం పచ్చని సంసారంలా మారుతుంది.

  • బొల్లెద్దు వెంకటరత్నం

RELATED ARTICLES
- Advertisment -

Latest News