Monday, October 27, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుMurder | తల్లిదండ్రులని దారుణంగా హత్య చేసిన కొడుకు... నెరేడ్‌మెట్‌ లో దారుణం

Murder | తల్లిదండ్రులని దారుణంగా హత్య చేసిన కొడుకు… నెరేడ్‌మెట్‌ లో దారుణం

మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ కొడుకు తన తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం నెరేడ్‌మెట్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాస్ అనే యువకుడు తన తల్లిదండ్రులైన రాజయ్య, లక్ష్మితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. మానసిక సమస్యల కారణంగా గత కొన్ని నెలలుగా ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నెల రోజుల క్రితం, అతని తల్లిదండ్రులు అతన్ని ఇంటికి తిరిగి తీసుకొచ్చారు.

అయితే, ఆదివారం రాత్రి శ్రీనివాస్ మద్యం మత్తులో ఉన్నాడని, ఆ సమయంలో కోపంతో తన తల్లిదండ్రులపై కర్రతో దాడి చేసి అక్కడికక్కడే హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న నెరేడ్‌మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న శ్రీనివాస్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News