Saturday, October 4, 2025
ePaper
Homeజాతీయంజాతీయ రాజ‌ధానిలో 100 మందికి క‌రోనా

జాతీయ రాజ‌ధానిలో 100 మందికి క‌రోనా

  • ఇండియాలో వెయ్యి దాటిన క్రియాశీల‌క‌ కేసులు
  • కేరళలో హ‌య్య‌స్ట్‌ 430 మందికి, మహారాష్ట్రలో 209 మందికి పాజిటివ్‌
  • మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మ‌హ‌మ్మారికి బ‌లి

దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ మళ్లీ కలకలం రేపుతోంది. ఏడు రోజుల్లోనే వందకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 2020లో తొలిసారి తెర మీదికి వ‌చ్చి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీసిన‌ ఈ వైరస్ మరోసారి పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్ర‌స్తుతం దేశం మొత్త‌మ్మీద క్రియాశీల‌క కేసుల సంఖ్య వెయ్యి దాటినట్లు కేంద్ర కొవిడ్-19 సమాచార నివేదిక తెలిపింది. ఒక్క ఢిల్లీలోనే 104 యాక్టివ్ కేసులు ఉండగా వీటిలో 99 కేసులు గడ‌చిన‌ వారం రోజుల్లోనే నమోదు కావ‌టం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News