Monday, October 27, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏపీకి పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

ఏపీకి పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయి పోలీస్ బాస్‌గా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఇన్‌చార్జి డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్‌(డీజీపీ)గా పనిచేశారు. ఇకపై ఈయన రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కొనసాగనున్నారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. జ‌మ్మూకాశ్మీర్‌కి చెందిన‌ హ‌రీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఐపీఎస్ శిక్ష‌ణ అనంత‌రం తొలిసారి ఏఎస్పీగా ఖ‌మ్మంలో, అనంత‌రం మెద‌క్‌, పెద్ద‌ప‌ల్లిలో చేశారు. త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో వివిధ విభాగాల్లో ప‌నిచేశారు. జ‌న‌వ‌రి 31న ద్వార‌కా తిరుమ‌ల రావు డీజీపీగా రిటైర్ కావ‌టంతో ఇన్‌ఛార్జ్ డీజీపీగా ప‌గ్గాలు చేప‌ట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News