Monday, October 6, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలులంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆర్ఐ

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆర్ఐ

పట్టాదారు పాసు పుస్తకంలో స్థలాన్ని ఎక్కించేందుకు లంచం డిమాండ్ చేసిన ఆర్‌ఐను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. సర్వే నంబర్‌ 355లో ఏడు గుంటల భూమిని రికార్డుల్లోకి ఎక్కించేందుకు ఆర్‌ఐ కృష్ణ 12లక్షలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు 9 లక్షలకు బేరం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

లంచం సొమ్ము తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని ఆర్‌ఐను పట్టుకున్నారు. రెండు గంటలకు పైగా ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. నిందితుడు కృష్ణను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కృష్ణపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News