Friday, September 12, 2025
ePaper
spot_img
Homeరాజకీయంరాహుల్ గాంధీతో మ‌హేశ్ కుమార్ గౌడ్ భేటీ

రాహుల్ గాంధీతో మ‌హేశ్ కుమార్ గౌడ్ భేటీ

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) అధ్య‌క్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఆలిండియా కాంగ్రెస్ క‌మిటీ (ఏఐసీసీ) అగ్రనేత, లోక్‌స‌భ‌లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో కుటుంబ సమేతంగా క‌లిశారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ రాహుల్ గాంధీతో రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే అందుబాటులో లేక‌పోవ‌టంతో టీపీసీసీ కార్య‌వ‌ర్గ నిర్ణ‌యం వాయిదా ప‌డింద‌ని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెల 30న మ‌రోసారి సీఎం రేవంత్‌తో క‌లిసి ఢిల్లీ వెళ్ల‌నున్నారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని రాహుల్ గాంధీ చెప్పిన‌ట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News