Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణరాష్ట్ర పోలీస్‌ కంప్లేంట్‌ ఆథారిటి కార్యలయం ప్రారంభం

రాష్ట్ర పోలీస్‌ కంప్లేంట్‌ ఆథారిటి కార్యలయం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అధికారం కార్యలయం హైదరాబాద్‌లోని బీ.ఆర్‌.కే.ఆర్ డి బ్లాక్‌లోని 8వ, అంతస్థులో ప్రారంభించారు. ఈ కార్యకమ్రంలో ముఖ్యథిగా విశ్రాంత న్యాయమూర్తి జస్టీస్‌ శివశంకర్‌రావు హజరై అధికారికంగా ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడంలో ఇలాంటి సంస్థలు ఎంతో ముఖ్యమని వివరించారు. ఎస్‌.పీ.సీ.ఏ పూర్తి స్వతంత్రంగా పనిచేస్తుందని, డీఎస్పీ, అంత కన్నా పై ర్యాంకు ఉన్న అధికారులు దుర్వినియోగం లేద నిర్లక్ష్యంపై ఫిర్యాదులు చేసేలా ప్రజలకు అందుబాటులో ఉండే వేదికగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

పోలీస్‌ వ్యవస్థ యొక్క నైతిక విలువలను నిలబెట్టడంలో చట్ట పరిపాలనమెరుగుపరచడంలో ఎస్‌.పీ.సీ.ఏ కీలక పాత్ర పోషించనుంది. పోలీసుల దుర్వినియోగం సంబంధిత ఫిర్యాదులకు పరిష్కారం కోసం ప్రజలు హైదరాబాద్‌ లోని బీఆర్‌కేఆర్‌ భవనం డీ బ్లాక్‌ 8వ, అంతస్థులో ఉన్న కార్యలయాన్ని సంప్రదించాలని చైర్మన్ విజ్ఞ‌ప్తి చేశారు. ఈకార్యక్రమంలో సభ్యులు ప్రమోద్‌ కుమార్‌ ఐపీఎస్‌ (రిటైర్డ్‌), ఆరవింద్‌రెడ్డి ఐపీఎస్‌ రిటైర్డ్‌, డాక్టర్‌ వర్రే వేంకటేశ్వర్లు, ఫిర్యాది అధికారి చైర్మన్‌ జిల్లా న్యాయమూర్తి రిటైర్ట్‌ వై.ఆరవింద్‌ రెడ్డి, కె.వి.రాం నర్సింహారెడ్డి, అదనపు ఎస్పీ,రిటైర్ట్‌, రాజేందర్‌, రమణకుమార్‌ ఏఐజీ. శాంతిభద్రతలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News