Tuesday, October 28, 2025
ePaper
Homeతెలంగాణప్రజావాణికి 62 ఫిర్యాదులు

ప్రజావాణికి 62 ఫిర్యాదులు

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు వెంటనే పరిష్కరించాలని, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ – 29, ఇతర శాఖలకు – 33, మొత్తం 62 దరఖస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News