Friday, October 3, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుఈడి విచారణకు సమయం కావాలి

ఈడి విచారణకు సమయం కావాలి

నేటి విచారణకు హాజరు కాలేనన్న రానా

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడి విచారణకు సమయం కావాలని నటుడు దగ్గుబాటి రానా కోరారు. ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం రానా దగ్గుబాటి జూలై 23న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే నేటి విచారణకు రానా దగ్గుబాటి హాజరు కావట్లేదు. ఈ విచారణకు మరింత సమయం కావాలని ఈడీని రానా కోరినట్లు సమాచారం. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ టాలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీలో ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నోటీసులు అందుకున్న వారిలో రానా దగ్గుబాటి, ప్రకాష్‌ రాజ్‌, విజయ్‌ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. వీరికి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారానికి సంబంధించి ఈడీ మనీలాండరింగ్‌ కోణంలో విచారణ జరుపుతోంది. ఈ యాప్‌ల ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ప్లుయెన్సర్లపై ఈడీ కేసులు నమోదు చేసింది. రానా దగ్గుబాటి గతంలో జంగ్లీ రమ్మీ అనే యాప్‌ను ప్రమోట్‌ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే, రానా పీఆర్‌ టీమ్‌ దీనిపై స్పందిస్తూ.. చట్టబద్ధంగా ప్రభుత్వం ఆమోదించిన గేమింగ్‌ యాప్‌లకు మాత్రమే రానా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడని ఆ ఒప్పందం 2017లోనే ముగిసిందని అతడి టీమ్‌ తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News