అబ్దుల్లాపూర్మెట్ మండలం పరిధిలోని బాటసింగారం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మండారి ధనంజనేయులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.
తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు 14సంవత్సరాల లోపు బాలుర విభాగం ట్రయతలోన్ {(1)60 మీటర్లు పరుగు పందెం( 2) లాంగ్ జంప్ (3) షాట్ పుట్ బ్యాక్ త్రో} లో పాల్గొనడానికి ఎంపికయ్యారు.
ఈనెల 7వ తేదీ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రంగారెడ్డి జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనపర్చినందుకు రాష్ట్ర స్థాయి కి ఎంపికయ్యారని ఈ పోటీలు ఈ నెల 17వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని ప్రధాన అథ్లెటిక్స్ స్టేడియం ఆదిలాబాద్ లో జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రతాప్ మాట్లాడుతూ— ధనంజనేయులు 5వ సారి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణం అంతేకాకుండా వివిధ రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ పోటీలకు కూడ ఎంపికయ్యాడు.
డాక్టర్ సోలపోగుల స్వాములు శిక్షణలో మా విద్యార్థులు పలు సార్లు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం మా పాఠశాలకే కాకుండా, మండలానికి మరియు జిల్లా కూడా గర్వకారణం.
ఈ సందర్భంలో పాఠశాల ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, బాటసింగారం సర్పంచ్ ఎర్రవెల్లి గౌరీ శంకర చారి మరియు ఉప సర్పంచ్ నార్లకొండ వెంకటేష్, గ్రామ ప్రజలు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం సభ్యులు, క్రీడాభిమానులు విద్యార్థికి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.

