Monday, January 19, 2026
EPAPER
Homeరంగారెడ్డిHonour | బాటసింగారం ZPHS విద్యార్దినీకి సన్మానం.

Honour | బాటసింగారం ZPHS విద్యార్దినీకి సన్మానం.

  • జడ్పిహెచ్ఎస్ బాటసింగారం విద్యార్థినికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ (ఐఏఎస్) సన్మానం.

బాటసింగారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినికి సన్మానం జరిగినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి ప్రతాప్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి 11వ క్రాస్ కంట్రీ అథ్లెటిక్ పోటీలో నాలుగు కిలోమీటర్ల, 18 సంవత్సరాల లోపు బాలికల విభాగంలో జిఎంసి బాలయోగి గచ్చిబౌలి స్టేడియంలో 02.01.2026 న జరిగిన పోటీలో పాల్గొన్న జడ్పీహెచ్ఎస్ బాటసింగారం విద్యార్థిని రుద్రాల వైష్ణవి నీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నవీన్ నికోలస్(ఐ ఏ స్).బుదవారం లకిడికపూల్ లోని ఆఫీస్ లో సన్మానించి, ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రతాప్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు పి. వెంకటేశ్వరరావు, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సొలపోగుల స్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని బాటసింగారం గ్రామ సర్పంచ్ ఎర్రవెల్లి గౌరీ శంకర్, ఉప సర్పంచ్ నార్లకొండ వెంకటేష్, పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. తిరుపతి, గ్రామస్తులు, క్రీడాభిమానులు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు, అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News