- అంతకు ముందు మిస్సింగ్‌గా కేసు నమోదు.. !
- కాగ్నానది వంతెన వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం..
ధరూర్ స్టేషన్ సమీపంలో కాగ్నానది ఒడ్డున (31) ఏళ్ల వ్యక్తి మృతి. చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరూర్ మండల్ పరిధిలోని కాగ్నానదిలో ఓ వ్యక్తి శవమై కనిపించడంతో ధారూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ధరూర్ మండల్ మైలారం గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన కొత్త తండాకు చెందిన పాతావత్ సుభాష్ (31) మద్యానికి బానిస అవడంతో కుటుంబ సభ్యులు మద్యం మాన్పించే ఉద్దేశంతో వారం రోజుల క్రితం అతడికి శివమాల వేయించారు.
వారం రోజులుగా మద్యం తాగకపోవడంతో సుభాష్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ఆదివారం కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో సుభాష్ భార్య హారిక ధారూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం సోమవారం ఉదయం స్టేషన్ ధరూర్, దోర్నాల్ గ్రామాల మధ్య కాగ్నానది ఒడ్డున సుభాష్ శవమై కనిపించాడు. అక్కడే అతని బైక్ కూడా ఉండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ధారూరు నుంచి దోర్నాల్ వైపు బైక్‌పై వెళ్తూ కాగ్నానది వంతెన వద్ద అదుపు తప్పి పడిపోయి? దాహం వేయడంతో నీరు తాగేందుకు నది ఒడ్డుకు వెళ్లి రాళ్ల మధ్య బోర్లా పడి శ్వాస ఆడక మృతి చెందినట్లు, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ధరూర్ ఎస్సై రాఘవేందర్ తెలిపారు.
