Friday, September 12, 2025
ePaper
spot_img
Homeస్పోర్ట్స్యశస్వీ జైస్వాల్ సెంచరీ

యశస్వీ జైస్వాల్ సెంచరీ

కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీ

టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్.. ఇంగ్లిష్ గడ్డపై సెంచరీ చేశాడు. 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గతేడాది వెస్టిండిస్, ఆస్ట్రేలియా పర్యటనల్లో శతకాలతో చెలరేగిన ఇతను ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 5వ సారి మూడంకెల స్కోర్ నమోదు చేశాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో క్రీజులో పాతుకుపోయాడు. జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. పేసర్ బ్రాండన్ కార్సే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, తర్వాత సింగిల్ తీసిన యశస్వీ టెస్టుల్లో వంద నమోదు చేశాడు. మరో వైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా 58 రన్నులతో నాటౌట్‌గా ఉన్నాడు. సారథి సైతం చెలరేగి ఆడుతుండటంతో టీమిండియా మంచి స్కోర్ దిశగా సాగుతోంది. వీరిద్దరి విధ్వంసంతో ఇండియా టీ టయానికి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 పరుగులు చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News