Monday, February 23, 2026
Homeరంగారెడ్డిMissing | వ్యక్తి అదృశ్యం.. పోలీసుల దర్యాప్తు ప్రారంభం

Missing | వ్యక్తి అదృశ్యం.. పోలీసుల దర్యాప్తు ప్రారంభం

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం యాప్రాల్ పరిధిలోని మైత్రి ఎంక్లేవ్ అపార్ట్మెంట్‌లో నివసిస్తున్న కనికరం రాజశేఖర్ (51), కనికరం కిరణ్మయి దంపతులు ఈ నెల 20వ తేదీన జరిగిన ఘటనతో ఆందోళనకు గురయ్యారు.

రాజశేఖర్ ఏఎస్ రావు నగర్‌లో పని ఉందని తన కుమార్తెకు తెలిపి ద్విచక్ర వాహనంపై అక్కడ దింపించుకున్నారు. అనంతరం తాత, నాన్నమ్మ ఉన్న సీతాఫల్మండి ప్రాంతానికి వెళ్తున్నానని కుమార్తెకు చెప్పి వెళ్లారు. అయితే అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు.
ఇంట్లో వెతికిన భార్య కిరణ్మయి రాజశేఖర్ మొబైల్ ఫోన్‌తో పాటు ఓ లేఖను కనుగొన్నారు. ఆ లేఖలో ఆర్థిక సమస్యల కారణంగా ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోతున్నట్లు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. బంధువులు, తెలిసిన వారు, తల్లిదండ్రుల వద్ద సంప్రదించినా రాజశేఖర్ ఆచూకీ లభించలేదు.

- Advertisement -

ఈ మేరకు భార్య కిరణ్మయి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News