యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అధ్యర్థులకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బండి మల్లన్న యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బండి మల్లన్న యాదవ్ మాట్లాడుతూ ఈనెల 24 నాడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు పోటీ చేసి మేమెంతో మాకు అన్ని సీట్లు గెలవాలని రాజకీయంగా ఎదగాలని సౌగాని కొమురయ్య యాదవ్ సారధ్యంలో మానకొండూరు మండలం కాదరగూడెం గ్రామం అరవింద ఫామ్ లో యాదవ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారని తెలిపారు.
రాబోయే రోజుల్లో యాదవులు గొర్లకు బర్లకే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందుకు పోవాలనీ తెలంగాణ రాష్ట్ర జనాభాలో యాదవులది రెండో స్థానం అని యాదవులు అత్యధిక సంఖ్యలో ఉన్న గ్రామాల్లో మండలాల్లో ఎంపీటీసీ జడ్పిటిసి సర్పంచి ఎంపీపీలను గెలిచి సాధించుకోవాలని ఇంత గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఉమ్మడి జిల్లా యాదవులు సద్వినియోగం చేసుకోవాలని ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన సౌగాని కొమురయ్య యాదవ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అన్నారు ఇట్టి కార్యక్రమంలో యాదవకుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి జంగా కొమురయ్య యాదవ్ ఉడుత రత్నాకర్ యాదవ్ నరసయ్య యాదవ్ వేణు యాదవ్ సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
