Monday, March 23, 2026
Homeనల్లగొండYadadri | యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన

Yadadri | యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానాలయంలో ఆలయ అర్చకులు ఘనంగా లక్ష పుష్పార్చనను నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో వేద మంత్రాలతో ఆలయ అర్చకులు ఘనంగా అభిషేకం నిర్వహించారు.పట్టు వస్త్రాలను ధరింపజేశారు.బంగారు,వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేశారు.గులాబీ, మందారం, మల్లె, చామంతి, చంపక, మల్లికా, వంటి అనేక రకాలైన పుష్పాలతో స్వామి అమ్మవార్లకు.

వేద మంత్రాలు మంగళవాయిద్యాల నడుమ సహస్రనామాన్ని పఠించారు. సహస్రనామార్చన చేస్తూ లక్ష పుష్పార్చన చేశారు.అలాగే ఉదయం సుదర్శన హోమం నిర్వహించారు. ఇందులో ఆంజనేయం, నరసింహం, వంటి దేవతల మూల మంత్రాలతో హవనం చేసారు. అలాగే నిత్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. సాయంకాలం వెండి జోడు సేవ నిత్యకల్యాణం వంటి సేవలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సురేంద్రాచార్యులు, ముఖ్య అర్చకులు వెంకటాచార్యులు, అర్చకులు అనిల్ కుమారాచార్యులు, సూపర్డెంట్ సీతారామచారి, సిబ్బంది ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News