Saturday, October 4, 2025
ePaper
Homeస్పోర్ట్స్ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఇవాళ (జూన్ 11న బుధవారం) లండన్‌లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడుతున్న ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ సెలెక్ట్ చేసుకుంది. వరల్డ్ టెస్ట్ ర్యాంకుల్లో ప్రస్తుతం ఆసీస్ టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే తడబడింది.

మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మధ్యాహ్న భోజన సమయానికి కంగారూలు 4 వికెట్లను చేజార్చుకొని కేవలం 67 రన్నులు మాత్రమే చేశారు. టెస్టుల్లో వరల్డ్ ఛాంపియన్‌గా మరోసారి నిలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆశించినట్లుగా శుభారంభం లభించలేదు. ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి దక్షిణాఫ్రికా చేరుకోవటం ఇదే తొలిసారి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News