మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy).. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో పర్యటించారు. సమ్మక్క(Sammakka), సారలమ్మ(Saaralamma) అమ్మవార్లను దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజనుల (Tribals) సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక, కోట్లాది భక్తుల కొంగుబంగారమైన సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా మేడారంలో శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్న అభివృద్ధి పనులను (Development Works) పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత గడువు లోపు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

- సుమారు 200 ఏళ్లకు పైగా ఉండేలా ఈ ప్రాంగణం అధునాతన సౌకర్యాలతో విరాజిల్లేలా సమ్మక్క సారలమ్మ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది.
- జాతర ప్రారంభానికి 15 రోజుల ముందే పనులు పూర్తిచేసుకోవాలని గడువు నిర్ణయించుకోవడం జరిగింది. అనుకున్న విధంగానే పనులు జరుగుతున్నాయి.
- రానున్న పది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభిప్రాయాలు, సూచనలు తీసుకొని మేడారంపై మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తాం.
- గిరిజనుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ జాతర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పాలా మేడారం అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ప్రభుత్వం కేటాయిస్తుంది.
- ఈ కార్యక్రమంలో పొంగులేటితోపాటు మంత్రులు సీతక్క(Seethakka), కొండా సురేఖ(Konda Surekha), అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ బలరాం నాయక్, ఎండోమెంట్ సెక్రటరీ, కమిషనర్, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, కలెక్టర్, ఎస్పీ, అధికారులు, సమ్మక్క సారలమ్మ పూజారులు పాల్గొన్నారు.
- Advertisement -
