ఉమెన్ టీమిండియా క్రికెటర్ (Team India Cricketer) స్మృతి మంధాన పెళ్లి రద్దయింది (Marriage Cancel). ఈ మేరకు స్మృతి మంధానతోపాటు ఆమెతో పెళ్లి నిశ్చయమైన మ్యూజిక్ డైరెక్టర్ (Music Director) పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) విడివిడిగా ప్రకటించారు. వాస్తవానికి వీరి పెళ్లి నవంబర్ 23నే జరగాల్సి ఉన్నా అనూహ్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇరువురూ స్పందించారు. కొన్ని వారాలుగా తన జీవితం గురించి జరుగుతున్న ఊహాగాలపై స్పష్టత (Clarity On Life) ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని, అందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు స్మృతి మంధాన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని ఇన్‌స్టాగ్రామ్‌లో కోరారు. జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పలాష్ ముచ్చల్ తెలిపాడు.
- Advertisement -
