Wednesday, March 4, 2026
Homeరంగారెడ్డిJustice | వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసన

Justice | వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య నిరసన

భార్య ఉండగా మరో మహిళతో వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు గృహిణి ధర్నా‌కి దిగింది. ఖమ్మం జిల్లాకి చెందిన సాయి చరణ్‌కి శిల్పతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 5 సంవత్సరం నుండి భార్యను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడు. భార్య భర్త కోసం తిరుగుతుండగా బండ్లగూడలో నివాసం ఉన్నాడని తెలిసి ఇంటికి రావడంతో లోపల తలుపులు పెట్టుకొని తీయట్లేదు అంటూ ఇంటి ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. పోలీసులకు చెప్పినా కూడా వచ్చి చూసి వెళ్లారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తపైన చట్టపరంగా చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News