Tuesday, February 10, 2026
Homeఆరోగ్యంBanana Shake | బనానా మిల్క్ షేక్ ఎవరు తాగాలో తెలుసా..?

Banana Shake | బనానా మిల్క్ షేక్ ఎవరు తాగాలో తెలుసా..?

  • అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే..
  • నిపుణుల సూచనలు ఏమిటో చదవండి..

అర‌టిపండును ఏ విధంగా తీసుకోవ‌డం మ‌న ఆరోగ్యానికి, జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు మంచిదో.. నిపుణులు దీని గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం, అర‌టిపండును ఏ రూపంలో తీసుకోవాలో వ్య‌క్తి శారీర‌క శ్ర‌మ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవాల‌నుకునే వారు అర‌టిపండును నేరుగా తీసుకోవ‌డం మంచిది.

జిమ్ కి వెళ్లే వారు, భారీ వ్యాయామాలు చేసే వారికి క్యాల‌రీలు ఎక్కువ‌గా అవ‌స‌ర‌మ‌వుతాయి. క‌నుక వ్యాయామాలు చేసేవారు అర‌టిపండును మిల్క్ షేక్ రూపంలో తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక ఆయుర్వేదం ప్ర‌కారం అర‌టిపండును న‌మ‌లి తిన‌డం మంచిద‌ని వారు చెబుతున్నారు. అర‌టిపండును న‌మ‌ల‌డం వ‌ల్ల లాలాజ‌లంలో ఉండే స‌మ్మేళ‌నాలు స‌క్రియం చేయ‌బ‌డ‌తాయి. దీంతో జీర్ణ‌క్రియ సుల‌భ‌త‌రం అవుతుంది.

- Advertisement -

అర‌టిపండును న‌మ‌ల‌డం వ‌ల్ల దానిలో ఉండే మొత్తం పోష‌కాలు శ‌రీరానికి చ‌క్క‌గా అందుతాయి. అర‌టిపండుతో స్మూతీ, షేక్ వంటివి చేసి తీసుకోవ‌డం వ‌ల్ల దానిని న‌మ‌లాల్సిన అవ‌స‌రం లేదు. ఇది జీర్ణవ్య‌వ‌స్థ‌పై అద‌న‌పు భారాన్ని క‌లిగిస్తుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆయుర్వేదం ప్ర‌కారం రెండు రెండు వేరువేరు ప‌దార్థాల‌ను క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర స‌హ‌జ స‌మ‌తుల్యం దెబ్బ‌తింటుంది.

అర‌టిపండును పాల‌తో క‌లిపి మిక్స్ చేసి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ నెమ్మదిస్తుంది. దీంతో క‌ఫం పెరుగుతుంది. ఇది సైన‌స్, జ‌లుబు, అల‌ర్జీ వంటి వాటికి దారి తీస్తుంది. బ‌నానా షేక్ పొట్ట‌లోకి చేరిన త‌రువాత అర‌టిపండులో ఉండే మాలిక్, సిట్రిక్ ఆమ్లాలు పాల‌తో క‌లిసి పెరుగుగా మారుతుంది. దీంతో జీర్ణ‌క్రియ నెమ్మ‌దిస్తుంది. బ‌నానా షేక్ జీర్ణం అవ్వ‌డానికి స‌మ‌యం ప‌ట్ట‌డంతో పాటు పోష‌కాల‌ను కూడా శ‌రీరం స‌రిగ్గా గ్ర‌హించ‌దు. క‌నుక అర‌టిపండును నేరుగా తీసుకోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News