Saturday, October 4, 2025
ePaper
Homeఆరోగ్యంఎక్సర్‌సైజ్ చేస్తే ఏంటి ఉపయోగం?

ఎక్సర్‌సైజ్ చేస్తే ఏంటి ఉపయోగం?

శారీరక, మానసిక ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలి. నడవటం, యోగా చేయటం, జిమ్‌కి వెళ్లటం తదితర కదలికలు బాడీని ఫిట్‌గా ఉంచుతాయి. లివింగ్ క్వాలిటీని పెంచుతాయి. కార్డియోవాస్కులర్ ఎక్సర్‌సైజ్ వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఇమ్యునిటీని పెంచుతుంది. కండరాల పటుత్వాన్ని, ఎముకల సాంద్రతను కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఎక్సర్‌సైజ్ చాలా ముఖ్యం. వ్యాయామం చేస్తే షుగర్ అదుపులో ఉంటుంది.

ఆర్థరైటిస్, కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాల ప్రమాదం తగ్గుతుంది. శారీరకంగా శ్రమిస్తే ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. స్ట్రెస్‌, ఆందోళనకు చెక్ పెట్టడానికి, నిరాశను పారదోలటానికి సాయపడే, అనుభూతినిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. రోజూ ఎక్సర్‌సైజ్ చేసేవారు కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తారు. వ్యాయామం నిద్రలేమిని నివారిస్తుంది. విశ్రాంతిని ఎంకరేజ్ చేస్తుంది. బాడీ అలిసిపోతే త్వరగా పడుకుంటారు. శారీరక కదలికలు డైలీ లభించే న్యాచురల్ మెడిసిన్స్‌లాంటివని చెప్పొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News