బాన్సువాడ (Bansuada) నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం కిష్టాపూర్, చించోల్లి, బాన్సువాడ గ్రామీణ మండలం కొల్లూరు గ్రామంలో అకాల వర్షాలకు (Rains) తడిసిన ధాన్యాన్ని (wet grain) ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు(Advisor To Government), బాన్సువాడ శాసన సభ్యుడు (Mla) పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy) పరిశీలించారు. నియోజవర్గంలో రెండు రోజుల పాటు కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి DSOతో ఫోన్‌లో మాట్లాడారు.
లారీల కోసం ఎదురుచూడకుండా తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే ట్రాక్టర్లలో రైస్ మిల్లు(Rice Mills)కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లర్లు సైతం తక్షణం ధాన్యం బస్తాలను దింపుకోవాలని, రైతులు ఇబ్బందిపడకుండా చూడాలని అన్నారు. రైతులతో మాట్లాడుతూ మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తూకం వేసిన బస్తాల పైన, ధాన్యం రాశులపైన పాలిథిన్(Polythene) కాగితాలను కప్పుకోవాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తరలింపులో సహకరించాలని, రైస్ మిల్లర్లతో మాట్లాడి అండగా ఉండాలని కోరారు.
