Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఆంధ్రప్రదేశ్జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా

జాతీయ ప్రధాన కార్యదర్శిగా తప్పుకుంటా

  • పార్టీలో కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇస్తాం
  • దావోస్‌లో పెట్టుబుడుల కోసం కృషి చేశాం
  • రెడ్‌బుక్‌ ప్రకారం చర్యలు తప్పవన్న లోకేశ్‌

ఇకపై పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పదవి తీసుకోనని, పార్టీకోసం పనిచేస్తానని మంత్రి లోకేశ్‌(Nara Lokesh) అన్నారు. తనతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కూడా పదవి తీసుకోరని అన్నారు. పార్టీలో కొత్తవారికి అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. సాక్షిపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు ఆయన హాజరయ్యారు. కేసు విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడిరది. కోర్టుకు హాజరైన అనంతరం లోకేశ్‌ విూడియాతో మాట్లాడారు.2019లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.. అప్పుడే వారికి లీగల్‌ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.. ఇది నాలుగో వాయిదా. నిజం నా వైపు ఉంది.. ఎన్ని సార్లయినా వస్తాను. ఆలస్యమైనా నిజం గెలుస్తుంది. ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నాను. ప్రభుత్వం నుంచి ఒక్క వాటర్‌ బాటిల్‌ కూడా తీసుకోలేదు. వచ్చిన వాహనం కూడా నాదే. సొంత డబ్బుతో డీజిల్‌ కొట్టించుకున్నా. ఎక్కడా ప్రభుత్వంపై ఆధారపడకూడదని నా తల్లి భువనేశ్వరి చిన్నప్పటి నుంచి నేర్పించారు. సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు కష్టపడతా. నావల్ల పార్టీకి ఏనాడూ చెడ్డపేరు రాకుండా చూసుకుంటా. ’యువగళం’ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హవిూని నిలబెట్టుకునేందుకు చర్యలు తీసుకుంటాం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News