Tuesday, October 28, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్బతికించే చదువులు కావాలి

బతికించే చదువులు కావాలి

గత కొన్నాళ్లుగా చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భవిష్యత్‌పై భరోసా కల్పించాల్సిన చదువులు.. మార్కులు, ర్యాంక్‌ల కోసం పోటీపడటంతోనే సరిపోతోంది. ఉజ్వలంగా వెలుగొందాల్సిన జీవితాలు అర్ధాంతరంగా బుగ్గిపాలవుతున్నాయి. అశాస్త్రీయ, మూస చదువులకు తోడు ట్యూషన్లు, స్టడీ అవర్లు, ప్రాజెక్టు పనులంటూ విరామంలేని బలవంతపు చదువులు.. తెలివికి కొలమానం కానే కావు. విద్యార్థుల సామర్థ్యాలను, సహజ నైపుణ్యాలను విస్మరించిన తల్లిదండ్రుల పంతాలు, యాజమాన్యాల దోపిడీతో లక్ష్యాన్ని చేరలేమనే ఒత్తిళ్లు పరాకాష్ఠకు చేరి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నాయి. సమాజం యువశక్తిని కోల్పోతోంది. ఇది ఎంత మాత్రం మంచిది కానేకాదు. బట్టీ చదువులు కాదు.. బతికించే చదువులు కావాలి.

RELATED ARTICLES
- Advertisment -

Latest News