హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా(Drinking Water Supply)లో తాత్కాలిక అంతరాయం(Temporary Interruption) ఏర్పడనుంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు 18 గంటల పాటు నీరు సరఫరా అవదు. అందువల్ల ఈ కింద పేర్కొన్న ప్రాంతాలవారు తగిన ముందుజాగ్రతలు(Precautions) తీసుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని(Use Sparingly) ప్రభుత్వం సూచించింది. నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాలు డివిజన్ల వారీగా..
- ఓ అండ్ ఎం డివిజన్ 15: మలేషియన్ టౌన్‌షిప్, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్ సెక్షన్, మాదాపూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
- ఓ అండ్ ఎం డివిజన్ 9: భరత్ నగర్, మూసాపేట సెక్షన్, గాయత్రీ నగర్ సెక్షన్, బాలానగర్ సెక్షన్, కేపీహెచ్‌బీలో కొంత భాగం, బాలాజీ నగర్ సెక్షన్‌లో కొంత భాగం
- ఓ అండ్ ఎం డివిజన్ ఫతేనగర్
- ఓ అండ్ ఎం డివిజన్ 17: గోపాల్ నగర్, హఫీజ్‌పేట్ సెక్షన్, మయూరి నగర్, మియాపూర్ సెక్షన్
- ఓ అండ్ ఎం డివిజన్ 22: ప్రగతినగర్ సెక్షన్, మైటాస్
- ట్రాన్స్‌మిషన్ డివిజన్ 2: బీహెచ్‌ఈఎల్, మిగ్-I, II, రైల్ విహార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చందానగర్
నగరానికి మంచి నీటిని చేసే సింగూరు ప్రాజెక్టు(Singur Project)లో పెద్దపూర్ నుంచి సింగపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేజ్-3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీ(Water Leakage)లను అరికట్టిందుకు అత్యవసర మరమ్మతు పనులు (Emergency Repair Works) చేపట్టనున్నారు. దీంతోపాటు టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 132 కేవీ కంది సబ్‌స్టేషన్ వద్ద పెద్దపూర్ ఫీడర్‌కు సంబంధించి ఏంఆర్‌టీ టెస్టింగ్, హాట్ లైన్ రిమార్క్స్‌తోపాటు సాధారణ నిర్వహణ పనులు చేపట్టనున్నారు. అందువల్ల నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.

