అతని నిజాయితీని మెచ్చుకున్న గ్రామస్తులు
నందిగామ, డిసెంబర్ 17 (ఆదాబ్ హైదరాబాద్): నందిగామ మండల (Nandigama Mandal) పరిధిలోని రంగాపూర్ గ్రామం(Rangapur Village)లో ఓ యువకుడు తనకు దొరికిన సెల్‌ఫోన్‌ని బాధితుడి(Victim)కి ఇచ్చేశాడు. బీహార్‌కి చెందిన బిగ్నేష్ మోహరణ.. రంగాపూర్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. డ్యూటీకి వెళుతున్న క్రమంలో పొరపాటున ఫోన్ పోగొట్టుకున్నాడు(Lost Phone). అదే సమయంలో అటు వైపు వెళుతున్న వార్డ్ మెంబర్ శ్రీరాములు(Ward Member Sriramulu)కు అది దొరికింది. దీంతో అతను బాధితుడి వివరాలు కనుక్కొని ఫోన్ అప్పజెప్పాడు. అదే మరొకరైతే ఆ ఫోన్‌ను సొంతం చేసుకునేవాళ్లని, శ్రీరాములు కాబట్టి నిజాయితీ(Honesty)గా వ్యవహరించాడని గ్రామస్తులు అభినందించారు. అతనికి బిగ్నేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
