Saturday, October 4, 2025
ePaper
Homeఅంతర్జాతీయంపశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు

ఇజ్రాయెల్‌ తాజగా ఇరాన్‌పై ముందస్తు దాడులు చేసింది. న్యూక్లియర్ పవర్ ప్లాంటు, ఆర్మీ ప్రదేశాలు లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడింది. ఇవాళ (జూన్ 13 శుక్రవారం) ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్‌ అఫిషియల్ మీడియా తెలిపింది. దీనికి బదులు తీర్చుకునేందుకు టెహ్రాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై కౌంటర్ ఎటాక్‌లకు పాల్పడింది. డ్రోన్లతో పంజా విసిరింది.

israel, iran war continue
israel, iran war continue

అయితే.. ఈ దాడులను ఇజ్రాయెల్‌ సక్సెస్‌ఫుల్‌గా అడ్డుకుంటోంది. ఇజ్రాయెల్‌ ఎటాక్‌లతో అలర్ట్ అయిన ఇరాన్‌.. తన గగనతలాన్ని క్లోజ్ చేసింది. దీంతో విమానాలు రావటానికి పోవటానికి ఇబ్బంది ఎదురవుతోంది. న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి, ఢిల్లీతోపాటు ముంబై నుంచి లండన్‌, న్యూయార్క్‌ల‌కు వెళ్లే అనేక విమానాలు నిలిచిపోయాయి. పలు విమానాలను దారిమళ్లించారు. మరికొన్ని వెనక్కి తిరిగివెళుతున్నాయి. దాదాపు 16 ఎయిరిండియా విమానాలను దారిమళ్లించినట్లు వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News