- నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.
- ప్రజాస్వామ్య విశ్వాసంతో ఓటెయ్యండి.
- తహాసిల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్ నాయక్.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజాస్వామ్య విశ్వాసంతో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తహసిల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్ నాయకులు అన్నారు. మంగళవారం పర్వతగిరి మండల కేంద్రంలో మదర్ తెరిస్సా మండల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ అవగాహన ర్యాలీకి వారు ముఖ్య అతిథిగా పాల్గొని మండల స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్ సెర్ప్ డిపిఎం కొల్లూరి శంకర్ లతో కలిసి ర్యాలీ ప్రారంభించారు.

ర్యాలీ ఎంపీడీవో కార్యాలయం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు కిలోమీటర్ పొడవున భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి ప్రతి ఒక్కరు ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి పౌరుడు మనదేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాతంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

మతము జాతి ప్రాంతము కులము వర్గము భాష భేదం లేకుండా ఎలాంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఎం శంకర్, ఏపిఎం రాజీరు, మండల సమైక్య ప్రతినిధులు స్వప్న, ఫరీదా బేగం, సిడిపిఓ దేబోరా సీసీలు గోలి కొమురయ్య, శ్యాంసన్, సుధాకర్, దేవేంద్ర సీఈఓ శ్రీనివాస్ ఐపీడీఎస్ సీఈఓ శ్రీనివాస్ సూపర్వైజర్లు, వివోఏలు, వివో ప్రతినిధులు అంగన్వాడి ఆశా కార్యకర్తలు మండల సమైక్య సిబ్బంది పూజారి రాధిక చిట్టి మల్ల అరుణ ఎస్వీబీ సీఆర్పీలు స్వయం సహాయక బృందాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


