- మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు
ఆలేరు నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే బురదలో వేసినట్టే అని అన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు..రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆలేరులో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కాబట్టి ఆలేరు మున్సిపాలిటీలో అధికార పార్టీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్లు చేసే పని శూన్యమన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి నిధులు తేవటంలో విఫలమవుతారని, వార్డులలో ఆలేరు మున్సిపాలిటీలో అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన పాలకవర్గం ఆలేరులో కొలువుతీరిన కానీ ఆలేరులో ఏలాంటి అభివృద్ధి పనులు నోచుకోలేదని, 20 ఏళ్ల క్రితం ఆలేరు ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ పల్లెలతో పాటుగా పట్టణాలను అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఆలేరులో 12 వార్డులకు గాను 12 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కు జోడిగా పంపితే ఆలేరు పట్టణాన్ని మోడ్రన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాడని, తాను మాటిస్తున్నానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ఓటు వేసి కాంగ్రెస్ చైర్మన్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళ సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, మాజీ డిసిసి అధ్యక్షులు అండం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈసారపు యాదగిరి గౌడ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు ఎజాజ్, నాయకులు కట్ట కొమ్ముల సాగర్ రెడ్డి, చింతల ఫణి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీలు, అశోక్,చీర శ్రీశైలం, కానుగు బాలరాజ్ గౌడ్, మిత్రపక్షాల నాయకులు,చెక్క వెంకటేష్, ఇక్బాల్ మోరిగాడి రమేష్ , తదితరులు పాల్గొన్నారు
