Monday, October 6, 2025
ePaper
Homeస్పోర్ట్స్Volleyball | ముంబై మీటియర్స్ ఘన విజయం

Volleyball | ముంబై మీటియర్స్ ఘన విజయం

ఆర్ఆర్ కేబుల్ ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్ (పీవీఎల్‌) నాలుగో సీజన్‌లో తొలి మ్యాచ్‌ గెలుపు జోరును హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ కొనసాగించలేకపోయింది. శనివారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన  మ్యాచ్‌లో సొంతగడ్డపై ఆడుతున్న హైదరాబాద్ బ్లాక్ హాక్స్‌కు ముంబై మీటియర్స్  షాకిచ్చింది.   ఏకపక్షంగా సాగిన పోరులో ముంబై 3–0 (15-9, 15-13, 15-7) తేడాతో హైదరాబాద్‌పై వరుస సెట్లలో విజయం సాధించి శుభారంభం చేసింది. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన శుభమ్ చౌదరి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు.

ఆట ప్రారంభం నుంచే ముంబై మీటియర్స్ తమ సర్వీస్‌లతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అభినవ్ సలార్ సూపర్ సర్వ్‌లతో హైదరాబాద్‌ డిఫెన్స్‌ను ఇబ్బంది పెట్టాడు. కీలక సమయంలో బ్లాక్‌హాక్స్‌ తీసుకున్న సూపర్ పాయింట్ నిర్ణయం బెడిసికొట్టింది. శుభమ్ చౌదరి అద్భుతమైన బ్లాక్‌తో హైదరాబాద్ ప్రయత్నాన్ని విఫలం చేసి ముంబైకి ఆధిక్యాన్ని అందించాడు. హైదరాబాద్ సెట్టర్ పాలో లమౌనియర్ తన పాస్‌లను నియాస్ అబ్దుల్ సలామ్, సాహిల్ కుమార్‌కు అందించినప్పటికీ, ముంబై వాళ్లను సమర్థవంతంగా నిలువరించింది. ఇద్దరు ఆటగాళ్లతో బ్లాకింగ్ వ్యూహాన్ని అమలు చేసి, పటిష్టమైన డిఫెన్స్‌ను ప్రదర్శించింది. మథియాస్ లోఫ్టెస్నెస్ కూడా తన దాడులతో ముంబైకి అండగా నిలిచాడు.

హైదరాబాద్ జట్టు తమ స్టార్ ప్లేయర్‌‌ గురును రంగంలోకి దింపి ముంబై డిఫెన్స్‌ను ఛేదించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరోవైపు, శుభమ్ నిర్విరామ దాడులతో హైదరాబాద్‌ను కోలుకోనీయలేదు. జాన్ జోసెఫ్‌తో పైప్ ఎటాక్‌లు చేయించి తిరిగి మ్యాచ్‌లోకి వచ్చేందుకు బ్లాక్ హాక్స్ ప్రయత్నించింది. కానీ, చివరి సెట్‌లో అభినవ్ సలార్ తన సర్వీస్‌లతో విరుచుకుపడ్డాడు. వెంటవెంటనే రెండు సూపర్ సర్వ్‌లు, మరో రెండు ఏస్‌లతో హైదరాబాద్‌ను దెబ్బతీసి మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పేశాడు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News