- అవగాహన సదస్సు
- వరంగల్ జిల్లా ఎఫ్ఎల్ సి కౌన్సిలర్ భాస్కరాచారి గ్రామ సర్పంచ్ కుసుమ సతీష్
చెన్నారావుపేట మండల పరిధిలోని బోజేర్వు గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వారు VLFLC కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా ఎఫ్ ఎల్ సి కౌన్సిలర్ భాస్కరాచారి మరియు గ్రామ సర్పంచ్ కుసుమ సతీష్ హాజరై బ్యాంకు లావాదేవీల గురించి వివరించడం జరిగింది.ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందించే సురక్ష బీమా యోజన,జీవన్ జ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ పథకాలను ప్రతి బ్యాంకు ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలపడం జరిగింది బ్యాంకులో తీసుకుని ప్రతి రుణాన్ని సకాలంలో చెల్లించాలని తెలియజేయడం జరిగింది
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఎలాంటి ఓటీపీలు ఎవరికి చెప్పవద్దని తెలియజేయడం జరిగింది ఎవరైనా సైబర్ నేరాల పట్ల డబ్బు పోగొట్టుకున్న ఎడల 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పెద్దబైన ఎల్లయ్య గారు నర్సంపేట CFL కౌన్సిలర్స్ నరేష్, వెంకన్న,హారిక,మరియు అధ్యక్షురాలు వెంకటలక్ష్మి సిఏ హాజరు కావడం జరిగింది.
