- ఎబివిపి వర్ధన్నపేట శాఖ ఆధ్వర్యంలో
వరంగల్ జిల్లా వర్ధన్నపేట శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా వివేకానందుని మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు పోవాలని సూచిస్తూ, స్వామి వివేకానంద ఆలోచనలు నేటి యువతకు మార్గదర్శకమని అన్నారు.

యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, విద్య, విలువలు, సమాజ సేవతో యువత ముందుకు సాగితే భారతదేశం విశ్వగురువుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అరుణ్, సంజయ్, ప్రేమ్, సాయి తదితరులు పాల్గొన్నారు.



