ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో 5వ రోజు ప్రపంచ ప్రఖ్యాత మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయాన్ని (University of Melbourne) సందర్శించారు. యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మైఖేల్ వెస్లీ, సీనియర్ అధ్యాపకులతో సంభాషించారు. ఆంధ్రప్రదేశ్(AndhraPradesh)లో నైపుణ్య అభివృద్ధి, ఆవిష్కరణలకు కొత్త మార్గాలను సృష్టించడానికి AI, సైబర్ సెక్యూరిటీ, IoT, క్వాంటం రీసెర్చ్‌ల్లో చేపట్టాల్సిన ఉమ్మడి కార్యక్రమాలపై చర్చించారు. ఏపీ వృద్ధి, స్థిరత్వాకి అనుగుణంగా పునరుత్పాదక ఇంధనం, స్థిరమైన వ్యవసాయం, ఆరోగ్య సాంకేతికత, స్మార్ట్ సిటీల్లో సహకరించాలని విశ్వవిద్యాలయాన్ని ఆహ్వానించారు.

