- ప్రజావాణిలో గ్రామస్తుల ఫిర్యాదు
పూడూరు కిష్టాపూర్ డివిజన్ పరిధిలో ని పూడూరులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన గోదాం పై చర్యలు తీసుకోవాలని సోమవారం మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డీసీ సుధాంశుకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఏదైనా కమర్షియల్ గోడౌన్ నిర్మాణానికి తప్పనిసరిగా వుండవలసిన 40 అడుగుల వెడల్పు గల రోడ్డు సదుపాయం లేని స్థలంలో భారీ గోదామును నిర్మించి రసాయనాల డంపింగ్ ఎగుమతి మరియు దిగుమతులు జరుపుతున్నారని పేర్కొన్నారు.
తద్వారా విడుదలయ్యే దుర్వాసన వల్ల చుట్టుపక్కల రైతులు ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. గతంలో పలుమార్లు మున్సిపల్ మరియు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. సదరు విషయంపై న్యాయం కోసం గౌరవనీయ హైకోర్టు తెలంగాణ రాష్ట్రం లో రిట్ పిటిషన్ నంబర్ 20972/2025లో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మల్లెల వెంకటేష్, రంగయ్య, శ్రీధర్,శ్రీశైలం సత్తిరెడ్డి, నిమ్మల కృష్ణ, నాగేశ్వరరావు, రాజశేఖర రెడ్డి, కుమార్, అనంతరెడ్డి పాల్గొన్నారు.
