Thursday, March 5, 2026
Homeఆరోగ్యంBhatti | విజయ డయాగ్నోస్టిక్ జిల్లా స్థాయి సేవలు ప్రారంభం

Bhatti | విజయ డయాగ్నోస్టిక్ జిల్లా స్థాయి సేవలు ప్రారంభం

విజయ మెడికల్ సెంటర్(Vijaya Medical Centre) జిల్లా స్థాయి (Distric Level) డయాగ్నోస్టిక్ సేవల(Diagnostic Services)ను డిప్యూటీ సీఎం(Deputy CM) మల్లు భట్టి విక్రమార్క ఈ రోజు వర్చువల్‌గా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా(Telangana Statewide) నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి అంశాల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ అసలైన ఎజెండా అని తెలిపారు. విశ్వసనీయమైన డయాగ్నోస్టిక్ సేవలు ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి కీలకమని పేర్కొన్నారు.

రెండో శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉచిత వైద్య శిబిరాలు (Free Medical Camps) నిర్వహించేందుకు ప్రోత్సాహం అందించనున్నామని వెల్లడించారు. ఆధునిక వైద్యం వ్యాధి గుర్తింపుపై ఆధారపడి ఉంటుందని, అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన పరీక్షా సదుపాయాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్, విజయ మెడికల్ సెంటర్ బృందాన్ని అభినందించారు. ఖచ్చితత్వం, నిష్పక్షపాతం, మానవతా విలువలతో తెలంగాణ ప్రజలకు సేవలందించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News