Tuesday, February 10, 2026
HomeతెలంగాణDoctorate | డాక్టరేట్‌ డిగ్రీ అందుకున్న విజయ్‌కుమార్‌ గుమాసా..

Doctorate | డాక్టరేట్‌ డిగ్రీ అందుకున్న విజయ్‌కుమార్‌ గుమాసా..

  • డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యూనివర్సిటీ నుంచి డాక్టర్ పట్టా..

డాక్టర్‌ ఏ.పీ.జే. అబ్దుల్‌ కలాం యూనివర్సిటీ నుంచి విజయ్‌కుమార్‌ గుమాసా పీహెచ్‌.డి డిగ్రీని అందుకున్నారు. “ డాటా సెక్యూరిటీ ఎంహెన్స్ డ్ బ్లాక్ చైన్ బేస్డ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సర్వర్ ప్లాటుఫార్మ్స్ ” అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు ఈ గౌరవం లభించింది.

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో, ఇంజనీరింగ్‌ & టెక్నాలజీ ఫ్యాకల్టీ పరిధిలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసిన విజయ్‌కుమార్‌ గుమాసా, డేటా సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సర్వర్‌ ప్లాట్‌ఫార్మ్‌లను మరింత భద్రతతో రూపకల్పన చేసే దిశగా నూతన సాంకేతిక పరిష్కారాలను ప్రతిపాదించారు.

- Advertisement -

ఆయన పరిశోధన ఆధునిక సైబర్‌ సెక్యూరిటీ రంగంలో కీలకమైన మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు అభినందించారు. పీహెచ్‌.డి డిగ్రీ ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు విజయ్‌కుమార్‌ గుమాసా కృషిని ప్రశంసించారు. తన విజయంపై స్పందించిన విజయ్‌కుమార్‌ గుమాసా, “ఈ గుర్తింపు నా పరిశోధన ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తుంది. భవిష్యత్తులో బ్లాక్‌చెయిన్‌ ఆధారిత సెక్యూరిటీ సిస్టమ్‌ల అభివృద్ధికి మరింత కృషి చేస్తాను” అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News