Saturday, March 7, 2026
Homeకరీంనగర్Vigilance | ఆర్జీ-1 ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు

Vigilance | ఆర్జీ-1 ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు

గోదావరిఖని: భారతరత్న (Bharat Ratna) సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) జయంతి (birth anniversary) సందర్భంగా ఆర్జీ-1 ఏరియాలోని జిఎం కార్యాలయంలో ఈ రోజు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు (Vigilance Awareness Week Celebrations) ప్రారంభమయ్యాయి. ఆర్జీ-1 జిఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిఎం మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి అవినీతి(Corruption) ఒక ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. కేవలం చట్టాలు(Acts), నిబంధనలు (Rules) మాత్రమే కాకుండా ప్రతిఒక్కరూ స్వార్థాన్ని వీడి నిజాయితీ(honesty)తో సామాజిక బాధ్యతను పాటించాలని పిలుపునిచ్చారు. సింగరేణి (Singareni) సంస్థలో అవినీతికి తావు లేకుండా పారదర్శకతతో కూడిన పని సంస్కృతిని నెలకొల్పాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ అధికారి హనుమంతరావు ఉద్యోగులందరితో పౌరుల సత్యనిష్ట ప్రతిజ్ఞ చేయించారు. ఈ వారోత్సవాలు ఆర్జీ-1 ఏరియాలోని జిడీకే 1, 3, 2, 2A, 11 ఇంక్లైన్, జిడీకే OC-5 గనులతో పాటు ఏరియా ఆసుపత్రి, అన్ని విభాగాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవంలో యస్.ఓ.టు జీఎం చంద్రశేఖర్, ఏజెంట్ చిలుక శ్రీనివాస్ తదితర ముఖ్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News