Friday, February 27, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐVenkaiah Naidu | సింగపూర్‌లో ఆత్మీయ సమ్మేళనం

Venkaiah Naidu | సింగపూర్‌లో ఆత్మీయ సమ్మేళనం

మాజీ ఉపరాష్ట్రపతి(Former Vice President) వెంకయ్య నాయుడితో సింగపూర్‌(Singapore)లో ఆత్మీయ సమ్మేళనం(Spiritual Communion) జరిగింది. శ్రీ సాంస్కృతిక కళా సారథి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొన్నారు. సింగపూర్ నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఈ సమావేశానికి సంస్థ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ అధ్యక్షత వహించారు. సింగపూర్‌లోని ఇండియా హైకమిషనర్(High Commissioner of India in Singapore) డాక్టర్ శిల్పక్ అంబులే కూడా హాజరయ్యారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మాతృభాష(Mother Language)ను పరిరక్షించుకోవాలని చెప్పారు. ‘భాష పోతే శ్వాస పోతుంది’ అని అన్నారు. సింగపూర్‌లోని తెలుగు సంస్థలు.. తెలంగాణ కల్చరల్ సొసైటీ(Telangana Cultural Society), టీడీపీ ఫోరం, కాకతీయ సంస్కృతిక పరివారం, ఏపీఎన్ఆర్‌టీ(APNRT) ప్రతినిధులు వెంకయ్య నాయుడిని సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News