- అండగా నిలిచిన వంటేరు ప్రతాప్ రెడ్డి
పుట్టుకతోనే గుండె సమస్యతో బాధపడుతున్న జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన 13 నెలల పసిపాప అనూషకు గజ్వేల్ బిఆర్ఎస్ ఇంచార్జ్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అండగా నిలిచారు. ఆపరేషన్ కోసం రూ.6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో, పేద స్థితిలో ఉన్న ఆ కుటుంబం వంటేరును ఆశ్రయించింది.
వెంటనే స్పందించిన ఆయన, కొండపాకలోని సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో పాపకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించారు. శుక్రవారం వారి గ్రామానికి వెళ్లి పాప ఆరోగ్యాన్ని విచారించి, కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట చిలుకూరి మధుసూదన్ రెడ్డి, వంటేరు శ్రీనివాస్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -
