Friday, October 3, 2025
ePaper
HomeUncategorizedVANGALAPUDI ANITHA | మైనర్లు ర్యాష్ డ్రైవ్..హోమంత్రి క్లాస్ 

VANGALAPUDI ANITHA | మైనర్లు ర్యాష్ డ్రైవ్..హోమంత్రి క్లాస్ 

విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న హోమంత్రి వంగలపూడి అనితకు ఆసక్తికర ఘటన ఎదురుపడింది. చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను గమనించిన హోంమంత్రి అనిత, తన కాన్వాయ్‌ను ఆపి మైనర్లను మందలించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్దమని ఆమె అన్నారు. అనంతరం ఆమె ఈ ఘటనను తల్లిదండ్రులకు తెలియజేయాలంటూ పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ..వాహనాలను నడిపే వయస్సు రాకముందే పిల్లలకు స్కూటీలు, బైకులు ఇవ్వడం వల్ల వారు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారన్నారు. ఇలా మైనర్లు వాహనాలు నడిపితే సమాజంలో వారి భవిష్యత్‌కు ముప్పుగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైన తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో చట్ట నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్‌ పాటించాలని ఆమె సూచించారు. పిల్లలు డ్రైవింగ్ కోరుతున్నారని వారి కోరికను అంగీకరిస్తే ప్రమాదకరమన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News