Friday, February 27, 2026
HomeజాతీయంVande Mataram | వందేమాతరం స్పూర్తి మంత్రం

Vande Mataram | వందేమాతరం స్పూర్తి మంత్రం

  • మాతృభూమి ఔన్నత్యాన్ని చాటేలా వందేమాతరం
  • వేదకాలం నుంచి మాతను కొలవడం ఆదర్శం
  • అదే స్పూర్తితో వందేమాతర గీతం రచన
  • దేశ స్వాతంత్య్రానికి వందేమాతరం ప్రేరణ
  • ఈ గీతమే జనప్రవాహాన్ని కదలించింది
  • బ్రిటిష్‌ వారితో పోరాటంలో ముందు నిలిచింది
  • కానీ.. నెహ్రూ ఈ గీతాన్ని అవమానించాడు
  • వందేమాతరానికి 150 ఏళ్ల ప్రస్తానంపై మోడీ

దేశ స్వాతంత్య్రానికి వదేమాతర గీతం ప్రేరణ అని ప్రధాని మోడీ అన్నారు. కోట్లాది మంది భారతీయులు ఈ గీతానికి ఉత్తేజితులై స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారని అన్నారు. ఇది దేశానికి ప్రేరణ ఇచ్చిన గీతమని, స్వాంతంత్య్ర సముపార్జనకు నాందిగా మారిందని అన్నారు. లోక్‌సభలో వందేమాతర గీతం 150వ వార్షికోత్సవంపై జరిగిన చర్చలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన వందేమాతర గీతం బెంగాల్‌లో బాగా ప్రాచుర్యం అయినట్లు మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా వార పత్రిక ’ఇండియన్‌ ఒపినియన్‌’లో డిఎంబర్‌ 2, 1905న రాశారు. బెంగాల్‌ స్వదేశీ ఉద్యమ సమయంలో బకించంద్ర రాసిన పాటను పాడటానికి లక్షలాది మంది ప్రజలు గుమిగూడి భారీ ర్యాలీలు నిర్వహించారు.

ఈ పాట ఎంతగా ప్రాచుర్యం పొందింది అంటే.. ఈ గీతమే మన జాతీయ గీతంగా మారింది. ఈ పాట భావాలు గొప్పవి. ఇది ఇతర దేశాల పాటల కంటే తియ్యగా ఉంటుంది. దేశభక్తిని మేల్కొల్పడం దీని ఏకైక లక్ష్యం. ఇది భారతదేశాన్ని తల్లిగా చూస్తుంది’ అని అన్నారు. రుగ్వేదంలోని శ్లోకాన్ని, రామాయణంలో రాముడు పలికిన వాక్యాలను ఈ సందర్భంగా ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశమంటే మన మాతృభూమిగా కొలవడం అనాదిగా వస్తోందని, వందేమీతర గీతానికి ఇవే ప్రేరణలని అన్నారు. లోక్‌సభలో వందేమాతరంపై జరుగుతున్న ప్రత్యేక చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్‌ పార్టీపై, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

- Advertisement -

కాంగ్రెస్‌ గతంలో జాతీయ గీతాన్ని ‘తుక్డే తుక్డే‘ చేసినట్టు ఆరోపించారు. అలాగే, వందేమాతరంతో ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఉందని నెహ్రూ పేర్కొన్నాడని చెప్పారు. సభలో ‘షేమ్‌ షేమ్‌‘ నినాదాలు వినిపించినప్పటికీ, మోడీ వ్యాఖ్యానిస్తూ.. గత శతాబ్దంలో కొన్ని శక్తులు జాతీయ గీతానికి సర్వనాశనం చేశాయని పేర్కొన్నారు. ఆ చరిత్రను వచ్చే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనదేనని ప్రధాని మోడీ అన్నారు. 1937లో మహమ్మద్‌ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్‌ వందేమాతరానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు.

అయితే, కాంగ్రెస్‌, నెహ్రూలు ఆ పోరాటాన్ని ఎదిరించ కుండా, వందేమాతరం పై విచారణకు ఆదేశాలు జారీ చేశారని విమర్శించారు. జిన్నా ఆందోళన తరువాత సుభాష్‌ చంద్ర బోస్‌కు నెహ్రూ రాసిన లేఖలో` వందేమాతరం మొత్తం చదివిన తరువాత అది ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందని భావిస్తున్నానని ఆయన వెల్లడిరచారు. అలాగే, అత్యవసర పరిస్థితి కాలాన్ని గుర్తు చేసుకుంటూ.. వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి దేశం మొత్తం బ్రిటిష్‌ వారి పాలనలో ఉండగా.. 100 ఏళ్లు పూర్తి అయ్యే సమయానికి దేశంలో అత్యవసర పరిస్థితి దేశాన్ని కబలించిందన్నారు.

స్వాతంత్య్ర సమరయోధులను జైలులో పెట్టిన ఆ కాలం భారత చరిత్రలో బ్లాక్‌ డేస్‌ గుర్తించబడిరదని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అయితే, వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ గీతానికి గౌరవం తిరిగి తీసుకురావాల్సిన సమయం ఇదేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 1875లో బంకిమ్‌ చంద్ర చట్టోపా ధ్యాయ రచించిన ఈ గీతం భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిగా నిలిచిందని ప్రశంసించారు. వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్లమెంట్‌ ఉభయ సభల్లో 10 గంటల ప్రత్యేక చర్చను ఏర్పాటు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News