జిల్లా పశు వైద్య అధికారి వెంకటయ్య
చిలిపిచేడ్: మనుషుల్లో కరోనా వైరస్ (Corona Virus) లాగానే పశువుల(cattle)ను వేధిస్తున్న అంటువ్యాధుల్లో (infections) మహాప్రమాదకరమైంది గాలికుంటు. ఈ రోగాన్ని నివారించడానికి ప్రతి రైతు మూగ జీవాలకు టీకాలు వేయించాలని మెదక్ (Medak) జిల్లా పశు వైద్య అధికారి వెంకటయ్య సూచించారు. శుక్రవారం చిలిపిచేడ్ మండలంలోని శీలంపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని (Free Veterinary camp) ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పశువులకు సీజనల్ వ్యాధులు (Seasonal diseases) రాకుండా నివారణ టీకాలు (Vaccines) వేయించుకోవాలని సూచించారు. గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారి డాక్టర్ వినోద్ కుమార్, ఎల్ఎస్ గట్టయ్య, వీఏ యాదయ్య, సిబ్బంది శంకరయ్య, సతీష్, సంగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
